- యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్ ఇవ్వాలని ఆదేశాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: వాట్సాప్ ఫిర్యాదులు, ప్రజావాణి ఫిర్యాదులపై నిరంతరం పర్యవేక్షించడంతో పాటు ప్రతి వారం తనకు ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్’ ఇవ్వాలని సీఎంసీ కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె అన్ని డిపార్ట్మెంట్ల హెడ్స్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇందులో కమిషనర్ మాట్లాడుతూ సిటిజన్ చార్టర్ ప్రకారం గడువు కచ్చితంగా పాటించాలన్నారు. లేకపోతే అధికారులకు జరిమానా విధిస్తామన్నారు. పౌర సేవా కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలని, అన్ని పేపర్లు సరిగ్గా ఉంటే ఆలస్యం చేయొద్దన్నారు. అవినీతికి పాల్పడటం, విధులకి సంబంధించి అలసత్వం వహించే అధికారుల విషయంలో సహించబోనని హెచ్చరించారు.
